ఏసీ ఆన్ చేసినా కరెంట్ బిల్లు పెరగకుండా ఉండాలంటే.. ఈ సీక్రెట్ తెలుసుకోండి!

ఏసీ ఆన్ చేసినా కరెంట్ బిల్లు పెరగకుండా ఉండాలంటే.. ఈ సీక్రెట్ తెలుసుకోండి!

ఎండలు పెరుగుతున్నకొద్దీ జనం వేడి, చెమటతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బయటికి వెళ్లకపోయినా, ఇంట్లో వేడితోనే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దాంతో దాదాపు పగలు, రాత్రి అనే తేడా లేకుండా 24 గంటలూ ఏసీలు ఆన్ చేస్తున్నారు. ఇంత వరకూ ఓకే. కానీ కరెంట్ బిల్లు సంగతేంటి..? ఒక్కసారిగా వేలల్లో వచ్చే బిల్లును చూస్తే, ఏసీలో కూడా చెమటలు పట్టడం ఖాయం. కానీ కొన్ని చిట్కాలు పాటిస్తే మాత్రం.. కరెంట్ బిల్లు తక్కువ చేసుకోవచ్చు.

డీఫాల్ట్ టెంపరేచర్ : ఈ ఏడాది మొదట్లోనే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) ఏసీ కంపెనీలకు డీఫాల్ట్ టెంపరేచర్ గా 24 డిగ్రీలను పెట్టమని సూచించింది. అంతకుముందు డీఫాల్ట్ టెంపరేచర్ 20 డిగ్రీలు ఉండేది. ఏసీ టెంపరేచర్ ఒక్కో డిగ్రీ పెంచుతున్న కొద్దీ.. కరెంట్ బిల్లు ఆరుశాతం తగ్గుతుందని కొన్ని స్టడీస్ కూడా చెప్తున్నాయి. ఇలా టెంపరేచర్ ని పెంచి బిల్లు తగ్గించుకోవచ్చు.

18 డిగ్రీల నుంచి 24 డిగ్రీలు : పెద్దపెద్ద నగరాల్లో పగలు టెంపరేచర్ మినిమం 34 డిగ్రీలు ఉంటోంది. సాధారణంగా మనుషుల బాడీ టెంపరేచర్ కూడా సుమారు 36-37 డిగ్రీలు ఉంటుంది. కాబట్టి ఏసీ టెంపరేచర్ బయటి కంటే పది డిగ్రీలు తక్కువ ఉంటే సరిపోతుంది. అంటే, 23-24 డిగ్రీలు పెడితే రూమ్ చల్లబడుతుంది. అందుకని 18 డిగ్రీల టెంపరేచర్ పెట్టకుండా... 23-24 డిగ్రీలు పెడితే చల్లగా ఉండొచ్చు. మరోవైపు కరెంట్ బిల్లు ఆదా చేసుకోవచ్చు.

సీల్డ్ రూమ్స్ బెటర్: ఇంట్లోని ఏసీ గాలి బయటి పోకుండా.. తలుపులు, కిటికీల్లోంచి వేడి ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి. ఇంట్లోని ఫ్రిజ్, టీవీ, కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు వేడిని విడుదల చేస్తాయి. అందుకని ఏసీ ఆన్ చేసినప్పుడు బయటి వేడి లోపలికి రాకుండా రూమ్ క్లోజ్డ్ గా ఉండాలి. అలాగే ఏసీ ఉన్న గదిలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఆన్ చేసి ఉంటే వాటిని ఆపేయాలి. రూమ్ చల్లగయ్యాక వాటిని ఆన్ చేసుకోవడం బెటర్.

►ALSO READ | జ్యోతిష్యం: గ్రహాల్లో రాకుమారుడు బుధుడు.. నాలుగు రాశుల వారికి అదృష్టం వరించేలా చేస్తాడు..! 

స్విచ్ ఆన్-స్విచ్ ఆఫ్ : పగలంతా రూమ్ లో ఏసీ ఆన్ చేసినప్పుడు, ఎలాగూ చల్లగానే ఉంటుంది. కాబట్టి రాత్రిళ్లు ఏసీ ఆఫ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎవరైనా మధ్యలో చల్లగా అనిపిస్తే దుప్పటి కప్పుకుంటారే తప్ప, లేచి ఏసీ ఆఫ్ చేసేంత మెలకువ, ఓపిక ఉండదు. అలా రాత్రంతా ఏసీ నడిచినప్పుడు కరెంట్ బిల్లు ఎక్కువ రావచ్చు. అలాగే పగలైనా, రాత్రైనా.. ఏసీని రెండు గంటలు ఆన్ చేసి మరో రెండు గంటలు ఆఫ్ చేయాలి. అలా చేస్తే రూమ్ చల్లగా ఉంటూనే కరెంట్ వాడకం తగ్గుతుంది.

ఏసీతో పాటు ఫ్యాన్ వేయాలి: ఇంట్లో ఏసీ నడుస్తున్నప్పుడు ఫ్యాన్ కూడా వేయాలి. అప్పుడు ఏసీ ద్వారా వచ్చే చల్లదనాన్ని ఫ్యాన్ గదంతా పరుస్తుంది. దాంతో వేడి త్వరగా పోయి గది చల్లబడుతుంది. అప్పుడు కొద్దిసేపు ఏసీ ఆపేయొచ్చు. కావాలంటే మళ్లీ వేడిగా అనిపించినప్పుడు ఆన్ చేసుకోవాలి.

రెగ్యులర్ సర్వీసింగ్ : ఏసీ లోపల పేరుకుపోయే చెత్త, దుమ్ము వల్ల పనితీరు నెమ్మదిస్తుంది. దానివల్ల రూమ్ చల్లబడే టైం పెరుగుతుంది. అంటే ఐదు నిమిషాలకు బదులు పది నిమిషాల టైం పడుతుంది. అందుకని ఫిల్టర్లలో ఉండే దుమ్మును ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. దానివల్ల 10- 15శాతం కరెంట్ బిల్లు ఆదా చేయొచ్చు. రెగ్యులర్ సర్వీసింగ్ ఏసీ పనితీరు మెరుగుపర్చడంతో పాటు పెద్దపెద్ద రిపేర్లను రాకుండా అరికడుతుంది. ఇలాంటి చిట్కాలను పాటిస్తే, చల్లగా ఉంటూనే కరెంట్ బిల్లు తగ్గించుకోవచ్చు.