జ్యోతిష్యం: గ్రహాల్లో రాకుమారుడు బుధుడు.. నాలుగు రాశుల వారికి అదృష్టం వరించేలా చేస్తాడు..! 

జ్యోతిష్యం: గ్రహాల్లో రాకుమారుడు బుధుడు.. నాలుగు రాశుల వారికి అదృష్టం వరించేలా చేస్తాడు..! 

తొమ్మిది గ్రహాలకు సంబంధించిన విశేషాలు జ్యోతిషశాస్త్రంలో కనిపిస్తుంది. ఈ నవ గ్రహాల్లో ఒకటి బుధ గ్రహం. జ్యోతిషశాస్త్రంలో బుధుడిని గ్రహాల రాకుమారుడు అని పిలుస్తారు. బుధ గ్రహం తెలివితేటలు, తర్కం, వాక్చాతుర్యం, కమ్యూనికేషన్, గణితం, వ్యాపారం, చర్మానికి కారకంగా పరిగణించబడుతుంది.  బుధుడు  కొన్ని రాశుల వారిని అదృష్టవంతులుగా మారుస్తాడని  జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ ఆరాశుల గురించి తెలుసుకుందాం. . .! 

వృషభ రాశి :  బుధుడు ఈ రాశి కి చెందిన వ్యక్తులకు ఆత్మవిశ్వాసాన్ని కలుగజేస్తాడు.  ఆర్థిక విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకొనేలా చేస్తాడని పండితులు చెబుతున్నారు.  వృత్తి .. వ్యాపార విషయాల్లో మెరుగైన ఫలితాలను ఇచ్చేందుకు సహాయపడతాడు. కార్యాలయంలో గుర్తింపు వచ్చే విధంగాను... వ్యక్తిగత జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా బుధుడు ఉంటాడని పండితులు చెబుతున్నారు. 

మిథునరాశి:  ఈ రాశికి బుధుడే అధిపత్యం వహిస్తాడు. ఈ రాశి వారు తీసుకొనే ప్రతి నిర్ణయంలో కూడా బుధుడు కీలకపాత్రపోషిప్తాడు. ఈ రాశి వారు బాగా మాట్లాడుతారు.  మీడియా, కమ్యూనికేషన్స్,  టెక్నాలజీ రంగాలకు చెందిన వారు మెరుగైన ఫలితాలను పొందుతారు.అంతేకాదు ఈ రాశికి చెందినవ్యాపారస్తులు ఎప్పుడూ లాభాల్లోనే ఉంటారని పండితులు చెబుతున్నారు.  

కన్యారాశి : ఈ రాశి వారికి బుధుడు ఏకాగ్రతను కలుగజేస్తాడు.  భవిష్యత్​ నిర్ణయాలు తీసుకొనేందుకు ప్రశాంతమైన వాతావరణాన్ని కలుగజేస్తాడు. ఇంటర్య్వూలకు వెళ్లే టప్పుడు.. కొత్త ప్రాజెక్ట్​లు ప్రారంభించేటప్పుడు ఈ రాశి వారు బుధ గ్రహానికి పూజ చేసిపెసలను నైవేద్యంగా సమర్పిస్తే అనుకున్న పని నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు. 

మకర రాశి : ఈ రాశి వారికి బుధుడు మెరుగైన  ఆర్థిక భద్రతను కలుగజేస్తాడు.  ఈ రాశి వారికి కొత్త అవకాశాలు వచ్చే విషయంలో బుధుడు కీలక పాత్ర పోషిస్తాడు.  బుధ గ్రహం అనుగ్రహం వల్ల వ్యాపారంలో అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోయి, కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. పఉద్యోగులకు కార్యాలయంలో అధికారుల మద్దతు లభిస్తుంది.  కుటుంబంలో ఆనందం, ప్రశాంతత వెల్లివిరుస్తాయి. బంధువులు, స్నేహితులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.