IFSCAలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు... జీతం నెలకు రూ. లక్షా 26 వేలు..

IFSCAలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు... జీతం నెలకు రూ. లక్షా 26 వేలు..

ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ (ఐఎఫ్ఎస్​సీఏ) ఆఫీసర్ గ్రేడ్ ఏ(అసిస్టెంట్ మేనేజర్) పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది.  

  • పోస్టుల సంఖ్య: 20.
  • పోస్టులు: ఆఫీసర్ ఇన్  గ్రేడ్ ఏ – జనరల్ 12, ఆఫీసర్ ఇన్ గ్రేడ్ ఏ – లీగల్ 04, ఆఫీసర్ ఇన్ గ్రేడ్ ఏ – ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 04.
  • ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి స్టాటిస్టిక్స్/ ఎకనామిక్స్/ కామర్స్/ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఫైనాన్స్)/ ఎకనోమెట్రిక్స్​లో మాస్టర్స్ డిగ్రీలో  ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ సైన్సులో బ్యాచిలర్ డిగ్రీ/ కంప్యూటర్ అప్లికేషన్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ పూర్తి చేసి ఉండాలి.కామర్స్​లో బ్యాచిలర్స్ డిగ్రీతోపాటు సీఏ/ సీఎఫ్ఏ/ సీఎస్/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లాలో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. 
  • వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 30 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
  • అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
  • అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 11.
  • లాస్ట్ డేట్: సెప్టెంబర్ 25.
  • అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.100.
  • సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
  • ఫేజ్–1 ఆన్​లైన్ ఎగ్జామినేషన్: అక్టోబర్ 11. 
  • ఫేజ్–2 ఆన్​లైన్ ఎగ్జామినేషన్: నవంబర్ 15. 
  • పూర్తి వివరాలకు www.ifsca.gov.in  వెబ్​సైట్​లో సంప్రదించగలరు.