అయోధ్య ఆలయంలో ఇఫ్తార్ విందు..

అయోధ్య ఆలయంలో ఇఫ్తార్ విందు..

అయోధ్య లోని ఓ ఆలయంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఎర్పాటు చేశారు ఓ పూజారి. ఇదు దశాబ్ధాల చరిత్ర కలిగిన సరయు కుంజ్ ఆలయంలో సోమవారం సాయంత్రం విందును ఇవ్వనున్నారు. ఇందుకు గాను ఆ ఆలయ పూజారి మహంత్ జుగల్ కిశోర్ శరన్ శాస్త్రి  మీడియితో మాట్లాడారు.  మత సామరస్యాన్ని, శాంతిని పెంపొందించేందుకు ఇలాంటి చర్యలు ఉపయోగపడతాయని ఆయన అన్నారు.

ఈ ఇఫ్తార్ విందుకు ఏ రాజకీయ పార్టీకి చెందిన నాయకులను ఆహ్వానించలేదని శరన్ శాస్త్రి తెలిపారు. గతంలో కూడా అయోధ్యలోని  ‘హనుమాన్ గర్హి’ దేవాలయంలో ఇఫ్తార్ విందును ఇచ్చినట్లు ఆయన గుర్తుచేశారు. అయోధ్యలో మత సామరస్యం ఏర్పాటు చేయడమే తమ అభిమతమని అన్నారు. ఇఫ్తార్ విందు ఇస్తున్న ఆలయం రామ జన్మభూమికి సమీపంలో ఉంది.