పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి : ఐఎఫ్టీయూ నేతలు

పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి : ఐఎఫ్టీయూ నేతలు

నస్పూర్‌‌‌‌‌‌, వెలుగు: పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వర్కర్స్ కు పెండింగ్ వేతానాలు వెంటనే చెల్లించాలని ఐఎఫ్​టీయూ నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం మంచిర్యాలలో ఎస్సీడీడీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ దుర్గాప్రసాద్ ను వినతిపత్రం అందించి మాట్లాడారు. గత 13 నెలల నుంచి వేతనాలు చెల్లించకుండా కార్మికులను ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. 

జిల్లాలోని లక్షెట్టిపేట, మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లిలోని పోస్ట్ మెట్రిక్ గర్ల్స్, బాయ్స్ హాస్టల్స్​లో విధులు నిర్వహిస్తున్న వాచ్​మెన్, కుక్, అసిస్టెంట్ కుక్, స్వీపర్, స్కావెంజర్స్ కు ప్రభుత్వం 13 నెలల వేతనాలు చెల్లించలేదని, సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల వర్కర్స్ కు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. బ్రహ్మానందం, కె.సంపత్, పోరండ్ల లక్ష్మి, సునీత, సుజాత, శ్రీదేవి, పద్మ, అనిత, హేమ తదితరులు పాల్గొన్నారు.