ఇండియన్ ఫుట్‌బాల్ టీం కోచ్‌పై వేటు

ఇండియన్ ఫుట్‌బాల్ టీం కోచ్‌పై వేటు

భారత్ ఫుట్ బాల్ జట్టు FIFA వరల్డ్ కప్ 2026 కు క్వాలీఫై కాలేదు. ప్రస్తుతం జరుగుతున్న క్వాలీఫై మ్యాచుల్లో ఇండియా ఫైనల్స్ కు అర్హత సాధించలేదు. దీంతో  ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ సోమవారం పురుషుల జట్టు ప్రధాన కోచ్ ఇగోర్ స్టిమాక్‌ను తొలగించింది. ఈరోజు ఏఐఎఫ్‌ఎఫ్‌ ఉపాధ్యక్షుడు ఎన్‌ఏ హరీస్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సునీల్ ఛెత్రీ సారథ్యంలో భారత్ జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేదు. క్వాలీఫై రెండో రౌండ్‌ను దాటేందుకు చాలా కష్టపడింది. ఈ ఏడాది 4 మ్యాచ్‌లు ఆడిన జట్టు కేవలం 2 పాయింట్లు మాత్రమే సాధించింది. దీంతో ఫీపా వరల్డ్ కప్ 2026 క్వాలిఫై లో అర్హత పొందలేదు.