-
కంపెనీల విభాగంలో సింగరేణి సంస్థకు కూడా
హైదరాబాద్, వెలుగు: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. బలరాం..ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ (ఐఐఐఈ) ప్రతిష్ఠాత్మక పర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నారు. బొగ్గు గనుల రంగంలో అత్యుత్తమ నాయకత్వంతో కంపెనీని పురోగతి పథంలో నడిపించినందుకు ఆయనకు ఈ అవార్డు దక్కింది. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో జరిగిన 25వ జాతీయ స్థాయి సీఈవోల సదస్సులో..బలరాం తరఫున అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఐఐఐఈ నేషనల్ కౌన్సిల్ సభ్యుడు భాస్కర్ అవార్డును స్వీకరించారు.
సోమవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్) ఎస్‌డీఎం సుభానీ, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ భాస్కర్ ఈ అవార్డును బలరాంకు అందజేశారు.2024-–25 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి విస్తరణ కోసం బలరాం వినూత్న ప్రాజెక్టులు చేపట్టారు.
సంప్రదాయేత ఇంధన వనరుల రంగంలో సంస్థను ముందుకు తీసుకెళ్లడంలో చొరవ తదితర కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకొని ఆయనకు ఈ అవార్డును ప్రకటించినట్లు నిర్వాహకులు తెలిపారు. గణనీయమైన టర్నోవర్, లాభాలతో ఉన్నత పనితీరు కనబరుస్తున్న సింగరేణి సంస్థకు కూడా కంపెనీల విభాగంలో పర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ అవార్డు లభించింది.
