రెండేళ్ల గరిష్టానికి ఐఐపీ.. తయారీ, గనుల రంగాల్లో మెరుగైన పనితీరే కారణం

రెండేళ్ల గరిష్టానికి ఐఐపీ.. తయారీ, గనుల రంగాల్లో మెరుగైన పనితీరే కారణం

న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి గత నెల 6.7 శాతం పెరిగి రెండేళ్ల గరిష్టానికి చేరింది. తయారీ, గనుల రంగాల్లో మెరుగైన పనితీరు ఇందుకు కారణం. జీఎస్​టీ రేట్ల తగ్గింపు వల్ల తయారీ ఆర్డర్లు పెరిగాయని నేషనల్​ స్టాటిస్టిక్స్​ఆఫీస్​(ఎన్ఎస్ఓ) తెలిపింది. 2024 నవంబర్‌‌‌‌లో ఇది 5 శాతంగా ఉంది. తయారీ రంగం 8 శాతం, గనుల రంగం 5.4 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

విద్యుత్ ఉత్పత్తి 1.5 శాతం తగ్గింది. 2026 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య ఐఐపీ వృద్ధి 3.3 శాతంగా ఉంది. మౌలిక సదుపాయాల రంగం 12.1 శాతం వృద్ధి చెందింది. డిసెంబర్ లో వృద్ధి 3.5 నుంచి 5.0 శాతానికి తగ్గొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.