పొరుగు దేశం పాకిస్తాన్ దురాగతాల నేపథ్యంలో ఇప్పటి వరకు ఎన్నో కథలు బాలీవుడ్ తెరపైకొ చ్చాయి. త్వరలో ఇండో పాక్ వార్ నేపథ్యంలో బోర్డర్ 2 కూడా రాబోతోంది. ఇటీవల పాక్ లోని గ్యాంగ్‍స్టర్ల తో పాటు ఐఎస్ఐ ఆట కట్టించేందుకు రా చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ నేపథ్యంలో రూపొందిన 'ధురంధర్' ఇప్పటికే విడుదలై బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
హీరోగా అమికాబ్ బచ్చన్ మనవడు ఎంట్రీ..
ఈ క్రమంలో 1971 ఇండో పాక్ వార్ నేపథ్యంలో సాగే కథతో మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే 'అక్కీస్' ఈ బయోగ్రాఫికల్ వార్ మూవీతో బాలీవుడ్ సూపర్ స్టార్ అమికాబ్ బచ్చన్ మనవడు అగ స్మనంద హీరోగా పరిచయం అవుతున్నాడు. ఒక కమర్షియల్ యాక్షన్ హీరోగా వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచుతూ లేటెస్ట్ గా ఫైనల్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
►ALSO READ | Bigg Boss Telugu 9 Finale: బిగ్ బాస్ 9 క్లైమాక్స్: కళ్యాణ్ పడాల 'విన్నర్' ఫిక్స్? ఓటింగ్ లో డీమాన్ పవన్ విధ్వంసం!
సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేత్రపాల్ కథ
ఇండియన్ ఆర్మీలోనే అతి చిన్న వయస్యుడైన పరమ్ వీర్ చక్ర గ్రహీత సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేత్ర పాల్ రియల్ స్టోరీ ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. ఇటీవల మృతి చెందిన నెటరన్ యాక్టర్ ధర్మేంద్ర, పాడా లోక్, మహారాజ్ ఫేమ్ జైదీష్ అర్జపర్ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచింది. 21 ఏళ్ల సెకండ్ లెఫ్టినెంట్ బాటిల్ ఆఫ్ బసంతర్ లో పాక్ సైన్యాన్ని ఎలా ఫైట్ చేశాడు అనే అంశాల్ని జోడించి తెరకెక్కించారు.
రిలీజ్ ఎప్పుడంటే?
యుద్ధం అంటే కేవలం తుపాకుల మోత మాత్రమే కాదు, వెనుక ఉన్న ఎమోషన్ కూడా అని నిరూపించేలా శ్రీరామ్ రాఘవన్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. కొత్త ఏడాది కానుకగా జనవరి 1, 2026న ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కానుంది. పాకిస్థాన్ దురాగతాలను ఎండగడుతూ, భారత జవాన్ల శౌర్యాన్ని చాటి చెప్పే 'అక్కీస్' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి!
