మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. బెల్లంపల్లి మండలం చాకేపల్లి, నెన్నెల మండలం లోని చిత్తాపూర్ గ్రామాల్లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. నెన్నెల మండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి పతకం ద్వారా మంజూరైన మెడికల్ షాప్, అగ్రికల్చరల్ ఇంప్లిమెంటేషన్ షాప్ లను ప్రారంభించారు.
ALSO READ | కుమ్రంభీం పోరాటం రాష్ట్ర సాధనకు స్ఫూర్తి : మంత్రి సీతక్క
నెన్నెల మండలంలోని ఘన్ పూర్, గంగారం గ్రామాల్లో యుపిఎస్, పీఎస్ పాఠశాలకు ప్రహరీ గోడ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. నెన్నెల మండలం అవుడం గ్రామ పంచాయితీలో రూ.4 లక్షల SDF నిధుల ద్వారా సైడ్ డ్రెన్ పనులకు శంకుస్థాపన చేశారు.