వెబ్ సిరీసుల్లోకి ఇలియానా

వెబ్ సిరీసుల్లోకి ఇలియానా

చాలామంది హీరోయిన్స్ వరుస సినిమాలు చేస్తూనే వెబ్ సిరీసుల్లోనూ నటిస్తున్నారు. ఇప్పుడు ఇలియానా కూడా ఈ వరుసలో చేరింది.  పదహారేళ్ల క్రితం టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె.. కొన్నాళ్లుగా బాలీ వుడ్‌‌లో పాగా వేసింది. సక్సెస్ పర్సంటేజ్ తక్కువే అయినా  ఆఫర్స్ బాగానే అందుకుంటోంది.  ఇప్పుడు డిజిటల్ ఎంట్రీకి కూడా  రెడీ అయ్యింది.

ఓ ఫిమేల్ ఓరియెంటెడ్  వెబ్ సిరీస్‌కి ఆమె  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరిష్మా కోహ్లీ  దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్​ని అప్లాజ్ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్, బీబీసీ స్టూడియోస్ ఇండియా సంస్థలు కలిసి  నిర్మిస్తున్నాయి. ఒక యునిక్ కాన్సెప్ట్​తో ఈ సిరీస్‌ని రూపొందించనున్నట్టు చెబుతున్నారు మేకర్స్. ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఇలియానా హిందీలో నటించిన ‘అన్‌‌ ఫెయిర్ అండ్ లవ్‌‌లీ’ చిత్రం రిలీజ్‌‌కి రెడీగా ఉంది. మరో రెండు సినిమాలు కూడా ఆమె చేతిలో ఉన్నాయి.