
ఎల్బీ నగర్, వెలుగు: నాగోల్ బండ్లగూడ పరిధి సహభవన్ టౌన్షిప్లో బ్లాక్ నంబర్ సీ-5లోని ఓ ప్లాట్‌లో షేక్ యేసు బాబు, పి. దుర్గ దంపతులు గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నడుపుతున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన యువతులను తీసుకొచ్చి అదే అపార్ట్మెంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. పక్కా సమచారంతో ఎల్బీ నగర్ ఎస్వోటీ పోలీసులు శుక్రవారం రాత్రి దాడి చేశారు. నిర్వాహకులైన ఇద్దరు దంపతులను, ఒక విటుడిని అరెస్టు చేశారు. వీరి నుంచి సెల్ఫోన్లు, రూ.2 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.