మూసీ బఫర్‌‌ జోన్లో అక్రమ నిర్మాణాలు కనిపించడం లేదా?

మూసీ బఫర్‌‌ జోన్లో  అక్రమ నిర్మాణాలు కనిపించడం లేదా?

గండిపేట, వెలుగు: మూసీ బఫర్‌‌ జోన్‌‌ లో అక్రమ నిర్మాణాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్​ఎమ్మెల్యే సుధీర్​రెడ్డి, బీఆర్‌‌ఎస్‌‌ రాజేంద్రనగర్‌‌ నియోజకవర్గ ఇన్‌‌చార్జి పట్లోళ్ల కార్తీక్‌‌ రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం నార్సింగి మూసీ నది పరివాహక ప్రాంతంలో పలు కట్టడాలను పరిశీలించి, నిరసన తెలిపారు. 

నార్సింగి నుంచి అత్తాపూర్‌‌ వరకు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. ఇవి ప్రభుత్వానికి, హైడ్రా అధికారులకు కనిపించకపోవడం ఏంటని మండిపడ్డారు. పేదల షెడ్లను కనికరం లేకుండా కూలుస్తున్నారని, బాధితులకు బీఆర్ఎస్​అండగా ఉంటుందని చెప్పారు.

 ఎమ్మెల్సీ నవీన్‌‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలట్‌‌ రోహిత్‌‌రెడ్డి, నార్సింగి మున్సిపల్‌‌ అధ్యక్షుడు కె.విష్ణువర్ధన్‌‌రెడ్డి, రాజేంద్రనగర్‌‌ నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు ముత్తర్ తదితరులున్నారు.