బీఆర్ఎస్ ఆఫీస్ జాగా కబ్జా.. 35 గుంటల భూమిలో అక్రమ నిర్మాణం

బీఆర్ఎస్ ఆఫీస్ జాగా కబ్జా.. 35 గుంటల భూమిలో అక్రమ నిర్మాణం

వరంగల్: వరంగల్ ​జిల్లాలో కబ్జాదారులు చెలరేగిపోయారు. ఏకంగా గులాబీ పార్టీకి చెందిన స్థలాన్ని ఆక్రమించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఖమ్మం హైవే నాయుడు పంప్ జంక్షన్ సమీపంలో సర్వే నెంబర్ 140, 142 లో 4,840 గజాల జాగను బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా ఆఫీసుకు జిల్లా కలెక్టర్, ఎమ్మార్వో కేటాయించారు. దీనిని రూ. 4,840లకు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందింది. దీంతో ఈ జాగాపై కొందరు  రియల్ స్టేట్ బడా బాబుల కన్ను పడింది. కోట్ల రూపాయల విలువ చేసే  35 గుంటల భూమిని భూమిని కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేశారు. దీని వెనుక కొందరు ఓ పార్టీ లీడర్లు ఉన్నట్లు తెలుస్తుంది. అక్రమ కట్టడాలను తొలగించి సామాన్య ప్రజలకు ఉపయోగపడే నిర్మాణం చేపట్టాలని రెవెన్యూ, మున్సిపల్ అధికారులను స్థానికులు కోరుతున్నారు.  అధికారం చేతిలో ఉందనే పేరుతో అప్పట్లో  పుల్లయ్యకుంట చెరువు భాగాన్ని సైతం రాత్రికి రాత్రి మొరంతో నింపి ఆఫీస్ కోసం ల్యాండ్ ఇచ్చేలా చేపించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి.