
పద్మారావునగర్, వెలుగు: అక్రమంగా పటాకులు నిల్వ ఉంచిన గోదాంపై టాస్క్ ఫోర్స్‌నార్త్ జోన్, తిరుమలగిరి పోలీసులు దాడులు నిర్వహించారు. తిరుమలగిరి టీచర్స్‌కాలనీలో దుర్గా ఏజెన్సీ పక్కన గల గోదాంలో అభిమన్యు కుమార్‌శర్మ(54) అనే వ్యక్తి అనుమతి లేకుండా భారీగా పటాకులు నిల్వ ఉంచాడు. టాస్క్ ఫోర్స్ బృందం, పోలీసులు దాడులు నిర్వహించి రూ.45 లక్షల విలువైన 250 కార్టన్ల పటాకులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఫుట్‌వేర్ షాపు మాటున..
మలక్ పేట: ముసారాంబాగ్ డివిజన్ శాలివాహననగర్ లో రామ్ గుప్తా(38) అనే వ్యక్తి ఫుట్ వేర్ దుకాణం నిర్వహిస్తున్నాడు. అందులో ఎలాంటి అనుమతులు లేకుండా పటాకులు విక్రయిస్తున్నాడు. సోమవారం టాస్క్‌ఫోర్స్, మలక్‌పేట పోలీసులు దాడులు నిర్వహించి రూ.8 లక్షల విలువైన క్రాకర్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సైదాబాబు, ఎస్సైలు రామారావు, మధు పాల్గొన్నారు.