ములుగు జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఏటూరునాగారం శివారులోని దెయ్యాలవాగులో క్వారీ ఏర్పాటు చేసిన కొందరు అడ్డగోలుగా ఇసుక దందా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. గోదావరి వరద ముంపు నుండి గ్రామ రక్షణ కోసం ఏర్పాటు చేసిన కరకట్టను తవ్వి భారీ గుంతలు పెట్టి ఇసుక తోడేస్తున్నారు వ్యాపారులు. అడ్డగోలుగా ఇసుక తీయడంతో గ్రామానికి ముంపు పొంచి ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక క్వారీ తీసేయాలని ఆందోళనకు దిగారు.
పట్టా భూమిలో పర్మిషన్ తీసుకొని.... అక్రమంగా నడివాగులో ఇసుక తవ్వకాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్థులు. వాగులో భారీ ఇసుక గుంతలతో కరకట్టకు ముప్పు తప్పదని ఆందోళన చెందుతున్నారు . TSMDC, రెవెన్యూ అధికారులు మామూళ్ల తీసుకొని అక్రమ ఇసుక తవ్వకాలపై నోరు మెదపడం లేదని ఆరోపిస్తున్నారు గ్రామస్థులు.
