ఈస్ట్​కోస్ట్ ఎక్స్​ప్రెస్​లో అక్రమంగా పిల్లల రవాణా

ఈస్ట్​కోస్ట్ ఎక్స్​ప్రెస్​లో అక్రమంగా పిల్లల రవాణా
  • ఈస్ట్​కోస్ట్ ఎక్స్​ప్రెస్​లో  అక్రమంగా పిల్లల రవాణా
  • 25 మంది చిన్నారులను కాపాడిన పోలీసులు
  • 10 మంది దళారుల అరెస్ట్

సికింద్రాబాద్, వెలుగు: వెస్ట్​ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 25 మంది పిల్లలను ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్  రైలులో అక్రమంగా తరలిస్తుండగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, బచ్​పన్ బచావో ఆర్గనైజేషన్ ‘చైల్డ్ లైన్’ వలంటీర్లు మంగళవారం వారిని కాపాడారు. అక్రమంగా తరలిస్తున్న పది మంది దళారులను పోలీసులు అరెస్టు చేశారు. 

నగరంలోని పలు పారిశ్రామిక సంస్థల్లో పనులు చేయించేందుకు వెస్ట్​ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన పిల్లలను సికింద్రాబాద్‌కు తీసుకువస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు సికింద్రాబాద్ ​రైల్వేస్టేషన్​కు వచ్చిన ఈస్ట్​కోస్ట్​ఎక్స్​ప్రెస్​లో తనిఖీలు చేసి 25 మందిని కాపాడారు. 

వారిని తరలిస్తున్న 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. పిల్లలను షెల్టర్​హోమ్​కు తరలించారు. విచారణ అనంతరం వారిని తల్లిదండ్రులకు అప్పగించనున్నట్లు పోలీసులు వెల్లడించారు.