నేను కూడా PCC రేస్ లో ఉన్నా : జగ్గారెడ్డి

నేను కూడా PCC రేస్ లో ఉన్నా : జగ్గారెడ్డి

PCC మార్పు జరిగుతుందని ప్రచారం జరుగుతోందని ..ఇదే నిజమైతే తాను కూడా రేస్ లో ఉన్నానని తెలిపారు MLA జగ్గారెడ్డి. దీనిపై మున్సిపల్ ఎన్నికల తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు. తనకు ఆవకాశం ఇస్తే….పార్టీ బలోపేతానికి ప్రజల సమస్యలపై పోరాటం చేస్తానని తెలిపారు. పార్టీని అధికారంలోకి తోసుకొచెందుకు కృషి చేస్తానన్న ఆయన.. అధిష్టానం ఎవరిని PCC చీఫ్ గా నియమించిన అందరం కలిసి పని చేయాల్సిందేనన్నారు.

ఇప్పడు కేసీఆర్ ఇచ్చే పథకాల కంటే ఇంకా బెటర్ పథకాలు తమ వద్ద ఉన్నాయన్నారు జగ్గారెడ్డి. ఖ్యమంత్రి పదవి ఆశించకుండా ఇంకా పని చేస్తానని తెలిపిన జగ్గారెడ్డి.. ఈ నెల 17న ఢిల్లీకి వెళ్లి  సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఇతర AICC  పెద్దలను కలుస్తానన్నారు.