ఓరీ దేవుడా ఆపండి.. పెళ్లిపై రామ్ పోతినేని ట్వీట్

ఓరీ దేవుడా ఆపండి..  పెళ్లిపై రామ్ పోతినేని ట్వీట్

టాలీవుడ్ యంగ్ హీరోల్లో ‘రామ్ పోతినేని’ ఒకరు. 2006లో ‘దేవదాసు’ ఫిల్మ్ తో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో.. పలు సినిమాల్లో నటించాడు. నటన, డైలాగ్స్ లతో అభిమానులను సంపాదించుకున్నాడు. పలు సూపర్ హిట్ సినిమాలు చేసిన ఈ నటుడిపై ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతను పెళ్లి చేసుకుంటున్నాడని.. చిన్నప్పటి క్లాస్ మేట్ తో కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు పుకార్లు షికారు చేశాయి. వీరి పెళ్లికి పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు.. త్వరలోనే పెళ్లి జరగబోతోందనే వార్తలు హల్ చల్ చేశాయి. దీంతో ‘రామ్’ స్పందించాల్సి వచ్చింది. ఈ మేరకు ట్వీట్ చేశారు. ఓ గాడ్..ఆపాలని కోరారు. రహస్యంగా హై స్కూల్ స్వీట్ హార్ట్ తో వివాహం చేసుకోవడం లేదని చెప్పారు. తన తల్లిదండ్రులు, స్నేహితులకు నచ్చచెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సీనియర్ ప్రొడ్యూసర్ స్రవంతి రవి కిశోర్ కుటుంబం నుంచి హీరోగా వెండి తెరపై కనిపించాడు.

‘రెడీ’ సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అయితే.. సినిమా రంగలో ‘రామ్’ ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నారు. విజయాలను చూసిన అతను ప్లాప్ లను కూడా చవి చూశారు. ఈ మధ్యనే వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా విజయం సాధించడంతో ఫుల్ జోష్ లో ఉన్నారు.  లింగుసామి దర్శకత్వంలో ‘ ది వారియర్’ లో నటిస్తున్నారు. రామ్ పోలీస్ ఆఫసర్ గా నటిస్తున్నారు. పోలీసు పాత్ర చేయడం ఇదే ఫస్ట్ టైమ్. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా చిత్రం తెరకెక్కనుందని సమాచారం. ఈ సినిమా నుంచి ‘బుల్లెట్ సాంగ్’ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు. జూలై 01వ తేదీ రాత్రి 7.57 గంటలకు ట్రైలర్ విడుదల చేస్తామని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఉత్తమ మేల్ డెబ్యూగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్న ‘రామ్’ ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘పండగ చేస్కో’, ‘కందిరీగ’, ‘నేను శైలజ’ చిత్రాల్లో నటించారు. వివాహ విషయంలో రామ్ స్పందించడంతో రూమర్స్ కు ఫుల్ స్టాప్ పడినట్లేనని చెప్పాలి.