కరోనిల్ సక్సెస్.. అల్లోపతి డాక్టర్లకు నచ్చట్లే

కరోనిల్ సక్సెస్..  అల్లోపతి డాక్టర్లకు నచ్చట్లే

న్యూఢిల్లీ: అల్లోపతి మందులపై ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. రాందేవ్ తన కామెంట్స్ ను వెనక్కి తీసుకున్నారు. అయినా ఈ వివాదం సద్దుమనగ లేదు. రాందేవ్ బాబా మీద ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రూ.1,000 కోట్ల పరువు నష్టం దావా వేసింది. ఈ విషయంపై తాజాగా పతంజలి సంస్థ చైర్మన్ ఆచార్య బాలకృష్ణ స్పందించారు. పతంజలి తయారు చేసిన కరోనా మందు కరోనిల్ మెడిసిన్ సక్సెస్ కావడం అల్లోపతి డాక్టర్లకు నచ్చడం లేదని ఆయన చెప్పారు. అందుకే బాబా రాందేవ్ కామెంట్స్ వివాదాన్ని పెద్దది చేస్తున్నారని ఫైర్ అయ్యారు. 

'మొత్తం దేశాన్ని క్రైస్తవంగా మార్చాలని చూస్తున్నారు. రాందేవ్ బాబాజీని టార్గెట్ గా చేసుకుని యోగా, ఆయుర్వేదాన్ని చెడుగా చిత్రించేందుకు యత్నం చేస్తున్నారు' అని ఆచార్య బాలకృష్ణ ఆరోపించారు. దేశ ప్రజలు మేలుకోవాలని లేకపోతే రాబోయే తరాలు మనల్ని క్షమించవని పేర్కొన్నారు.