గాల్లో ఎగరనున్న డబుల్ డెక్కర్ ఎయిర్ ప్లేన్.. టెక్నాలజీకీ హాట్సాఫ్

గాల్లో ఎగరనున్న డబుల్ డెక్కర్ ఎయిర్ ప్లేన్.. టెక్నాలజీకీ హాట్సాఫ్

పురాణాల్లో ఉన్న పుష్పక విమానం గురించి మీకు తెలుసా.. దాంట్లో ఎంత మంది కూర్చున్నా ఇంకొకరు కూర్చోడానికి ఎప్పుడూ ఓ సీటు ఖాళీనే ఉంటుంది.  మరి కలియుగంలో మేమేం తక్కువా..? అని అనుకుంటున్నారేమో కొందరు. ఏకంగా విమానాలని కూడా డబల్​ డెక్కర్​గా రీమోడల్​ చేసి దారి సామర్థ్యాన్ని పెంచుతున్నారు. ఇంతకీ ఈ డబల్​ డెక్కర్​ విమానం కథేమిటో తెలుసుకోవాలని ఉందా.. అయితే ఈ వార్త చదవాల్సిందే. 

డబుల్ డెక్కర్ బస్సుల గురించి, రైళ్ల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే స్ఫూర్తిగా తీసుకుని డబుల్ డెక్కర్ ఎయిర్ ప్లెయిన్ లు రాబోతున్నాయి. వీటికి సంబంధించిన పలు ఫొటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అలెజాండ్రో న్యూనెజ్ విసెంట్ రూపొందించిన ఈ కాన్సెప్ట్ జర్మనీలోని హాంబర్గ్‌లో జరిగిన ఎయిర్‌క్రాఫ్ట్ ఎక్స్‌పోలో ప్రదర్శించబడింది. ఈ ఫొటోలను విసెంట్ తన ఇన్ స్టాగ్రామ్ (Instagram) ఖాతాలో అప్‌లోడ్ చేశారు. దీనికి మిశ్రమ స్పందన లభిస్తోంది. డబుల్ డెక్కర్ సీటు స్థలాన్ని ఆఫ్టిమైజ్ చేయడంలో సహాయపడుతుందని, విమానంలో ఖాళీ స్థలాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని ఈ సందర్భంగా విసెంట్ తెలిపారు.

ఈ క్రమంలో డబుల్ డెక్కర్ సీట్లపై విపరీతంగా చర్చ జరుగుతోంది. నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. తమకు భద్రతాపరమైన సమస్యలు, ప్రశ్నలు ఉన్నాయని, అత్యవసర సమయంలో ఇది ఎలా పని చేస్తుందంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మంటలు లేదా పొగలు సంభవించినట్లయితే, అన్ని చక్రాలు ఆగిపోయిన తర్వాత విమానాన్ని ఖాళీ చేయడానికి 90 సెకన్ల కంటే తక్కువ సమయం ఉంటుంది. దానిని ఖాళీ చేయడం చాలా కష్టం అంటూ మరొక యూజర్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

https://www.instagram.com/p/Ce6jvqOMvCN/?utm_source=ig_embed&ig_rid=e8b8474c-0c29-4c5e-851e-2f2520136f4b