హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది జూన్‌లో లోటు వర్షపాతం నమో దైనా.. జులైలో మాత్రం దండిగానే పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దేశంలోని చాలా ప్రాంతాలపై ఎన్నినో ఎఫెక్ట్ ఉన్నా.. మన రాష్ట్రంలో మాత్రం సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవు తుందని శుక్రవారం తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సాధారణం కన్నా అత్యంత ఎక్కువ వర్షపాతం ఉం టుందని వెల్లడించింది. ఓవరాల్‌గా రాష్ట్రంలో మంచి వర్షపాతమే నమోదవుతుందని పేర్కొంది.
తెలం గాణ, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, ఏపీ (రాయలసీమ మినహా) మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ సాధారణం కంటే తక్కు వగానే వర్షాలు పడతాయని తెలిపిం ది. ఈ సీజన్‌లో ఎల్ నినో ప్రభావం గ్యారంటీగా ఉంటుందని ఎన్వోఏఏ (నాసా), స్కైమెట్ వంటి వాతావరణ ఏజెన్సీలు చెబుతున్నా.. వాతావరణ శాఖ మాత్రం అలాంటి పరిస్థితులేమీ ఉండవని గతంలో ప్రకటించింది.