
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో ఆదివారం ఉదయం వర్షం దంచికొట్టింది. వర్షం కారణంగా పలుచోట్ల రోడ్లపై మోకాళ్ల లోతు వరద నీరు చేరింది. సండే హాలిడే కావడంతో ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పాయి. వర్షం కురవడంతో వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద హైడ్రా మాన్సూన్ టీమ్స్ సిబ్బంది చర్యలు చేపట్టారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా పనులు చేశారు.
అత్యధికంగా ఖైతరాబాద్ లో 4.68 సెంటిమీటర్ల వాన పడింది. నగరంలో ఈ నెల 7, 8, 9 తేదీల్లో మూడ్రోజులపాటు భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. సోమవారం మాత్రం ఎటువంటి హచ్చరికలు జారీ చేయలేదు.