రానున్న మూడు రోజులు హైదరాబాద్‌లో వర్షాలు: ఐఎండీ

రానున్న మూడు రోజులు హైదరాబాద్‌లో వర్షాలు: ఐఎండీ

రాబోయే మూడు రోజులు(నవంబర్ 22, 23, 24 తేదీలు) నగరంలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(ఐఎండీ) అంచనా వేసింది. నగరంలోని ఆరు జోన్లు.. చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బి నగర్, సికింద్రాబాద్, మరియు శేరిలింగంపల్లి పరిధిలో తేలికపాటి వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది.

వాతావరణ శాఖ ప్రకారం.. బుధవారం నుండి శుక్రవారం వరకు ఉదయం వేళల్లో కూడా నగరంలో పొగమంచు వాతావరణం ఉంటుంది. హైదరాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 18-20 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత 30-32 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.  మరోవైపు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టిఎస్‌డిపిఎస్) నివేదించింది.