గుడ్ న్యూస్.. మరో మూడు రోజుల్లోనే నైరుతి రుతుపవనాలు

గుడ్ న్యూస్.. మరో మూడు రోజుల్లోనే నైరుతి రుతుపవనాలు

హైదరాబాద్, వెలుగు: ఈసారి నైరుతి రుతుపవనాలు అతి త్వరగానే ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 13నే దక్షిణ అండమాన్​ సముద్రం, బంగాళాఖాతం, నికోబార్​ దీవుల్లోకి ప్రవేశించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శుక్రవారం బులెటిన్​లో పేర్కొంది. నిరుడుతో పోలిస్తే ఈ సారి రుతుపవనాలు రెండు వారాల ముందే ఎంటరవుతాయని అంచనా వేసింది. 

నిరుడు మే 31న నైరుతి రుతుపవనాలు అండమాన్​లోకి ఎంటర్​కాగా.. జూన్​ తొలి రెండోవారంలో తెలంగాణలోకి ప్రవేశించాయి. ఇప్పుడు ఐఎండీ చెప్పినట్టు ఈ నెల 13నే నైరుతి రుతుపవనాలు అండమాన్​లోకి వస్తే.. మన రాష్ట్రంలోనూ ఆ తర్వాత వారం రోజుల్లోనే విస్తరించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉండనున్నాయి. దీనిపై వచ్చే వారం విడుదల చేసే మాన్సూన్​ ఫోర్​కాస్ట్​లో పూర్తి వివరాలను ఐఎండీ వెల్లడించే అవకాశాలున్నాయి.