రాబోయే రెండు గంటలు భారీ వర్షం.. హైదరాబాద్ సహా ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్

రాబోయే రెండు గంటలు భారీ వర్షం..   హైదరాబాద్ సహా ఆ జిల్లాలకు  రెడ్ అలర్ట్

తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ అత్యవసర హెచ్చరిక జారీ చేసింది.రాబోయే రెండు గంటల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో... తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

ముఖ్యంగా... రాబోయే రెండు మూడు గంటల పాటు సూర్యాపేట,  హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాల్లో గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల తుఫాను వేగంతో... బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉండడంతో... వాతావరణ శాఖ ఈ రెండు జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

మరోవైపు... హైదరాబాద్, ఖమ్మం, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు మోస్తరు వర్ష సూచన ఉంది. ఈ జిల్లాల్లో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో... వాతావరణ శాఖ 'ఆరెంజ్ అలర్ట్' ప్రకటించింది.

వీటితో పాటు... భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీచే ఛాన్స్ ఉండడంతో... ఈ జిల్లాలకు 'ఎల్లో అలర్ట్' జారీ చేశారు. రాబోయే రెండు గంటల పాటు వాతావరణం అత్యంత కీలంగా మారనున్న నేపథ్యంలో... ప్రయాణాలు చేసే వారు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.