మతిస్థిమితం లేని మాజీ ఉద్యోగి..

మతిస్థిమితం లేని మాజీ ఉద్యోగి..

సికింద్రాబాద్: సనత్ నగర్ అశోక్ కాలనీలో ఉండే ఇమ్మడి నర్సింగ్ (53)  రైల్వేలో జాబ్ చేసేవాడు. మతిస్థిమితం కోల్పోవడంతో అతడిని జాబ్ నుంచి తొలగించి కొడుకుకు ఇచ్చారు. ఈనెల15న ఉదయం 8.30 గంటలకు నర్సింగ్ కుటుంబసభ్యులతో కలిసి మెట్టుగూడలోని రైల్వే ఆస్పత్రికి వెళ్లారు. ఉదయం 11 గంటలకు నర్సింగ్ ఆకలిగా ఉందని టిఫిన్ చేసి వస్తానని డబ్బులు తీసుకుని బయటకు వెళ్లాడు.  ఎంతకీ రాకపోవడంతో స్థానికంగా వెతికినా కనిపించలేదు . ఇంటికి వెళ్లగా అక్కడ కూడా నర్సింగ్ జాడ దొరకలేదు. అతడు ఇప్పటికే 12 సార్లు ఇంట్లోంచి  వెళ్లిపోయినా తిరిగి వచ్చాడు. కానీ ఈసారి అతడి ఆచూకీ లభించలేదు. దీంతో గురువారం కుటుంబసభ్యులు లాలాగూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు.