మణిపూర్లో తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలి: ఆకునూరి మురళి

మణిపూర్లో తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలి: ఆకునూరి మురళి

మణిపూర్లో తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి డిమాండ్ చేశారు. మణిపూర్ లో హత్యాకాండపై జాగో తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో  నిర్వహించిన సమావేశంలో మురళి పాల్గొన్నారు. మణిపూర్ లో  పోలీస్ స్టేషన్ కు అతి సమీపంలో మహిళలపై జరిగిన అమానుష దాడిపై పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు.  నామమాత్రపు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని  మురళి ఆరోపించారు. వెంటనే మణిపూర్ లో పోలీస్ యంత్రాంగాన్ని మార్చాలని.. డీజీపీని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కేసును సుప్రీంకోర్టుతో  విచారణ జరిపించాలని కోరారు. దీనిపై  కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని మణిపూర్లో శాంతి భద్రతను నెలకొల్పాలని మురళి కోరారు. ఈ కార్యక్రమంలో  జాగో తెలంగాణ రాష్ట్ర ఛైర్మన్ జస్టిస్ చంద్రకుమార్, కన్వీనర్ ఆకునురి మురళీ,జాగో నాయకులు, తదితరాలు పాల్గొన్నారు.