
హైదరాబాద్లో గణనాధుల నిమజ్జనం కొనసాగుతోంది. ట్యాంక్ బండ్ లో నిమజ్జనానికి ట్రక్కులు, లారీల్లో పెద్ద ఎత్తున గణేషులు తరలివస్తున్నారు. నిమజ్జనం తర్వాత వాహనాలు రాకపోకలకు ప్రత్యేక రూట్లు ఏర్పాటు చేశారు అధికారులు. ట్రక్కులు, లారీలు ఎగ్జిట్ కు ఇలా రూట్ మ్యాప్ ఇచ్చారు.
ఎన్టీఆర్ మార్గ్‌లో నిమజ్జనం తర్వాత..ఖాళీ ట్రక్కులు, లారీలు నెక్లెస్ రోడ్ రోటరీ, - ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వీవీ స్టాచ్యూ జంక్షన్, కేసీపీ జంక్షన్ నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. లక్డీకాపూల్, తెలుగు తల్లి విగ్రహం, మింట్ కాంపౌండ్ రోడ్ వైపు వెళ్లడానికి పర్మిషన్ లేదు.
పీవీఎన్ఆర్ మార్గ్‌లో.. పీపుల్స్ ప్లాజా, బేబీ పాండ్స్ వద్ద నిమజ్జనం తర్వాత ఖాళీ ట్రక్కులు, లారీలు నెక్లెస్ రోడ్ రోటరీ దగ్గర రైట్తీసుకుని ఖైరతాబాద్ ఫ్లైఓవర్, వీవీ స్టాచ్యూ జంక్షన్– కేసీపీ జంక్షన్ నుంచి వెళ్లాలి. సంజీవయ్య పార్క్ నుంచి వెళ్లడానికి పర్మిషన్లేదు.
అర్ధరాత్రి తర్వాత ఎన్టీఆర్ మార్గ్‌లో నిమజ్జనం చేస్తే ..తెలుగు తల్లి జంక్షన్, పాత అంబేద్కర్ విగ్రహం, లిబర్టీ, హిమాయత్‌నగర్ నుంచి వెళ్లిపోవాలి.
ఇతర లారీలకు నో ఎంట్రీ
ఇంటర్ డిస్ట్రిక్ట్, నేషనల్ పర్మిట్ ఉన్న భారీ వాహనాలు, లారీలకు సిటీలోకి అనుమతి లేదు. వీటిని శివార్లలోనే ఆపేస్తారు. వీరు కావాలంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్లిపోవచ్చు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, ఇతర అవసరాల కోసం వచ్చే లారీలకు శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం రాత్రి 11 గంటల వరకు నగరంలోకి అనుమతి లేదు.
160 ఉత్సవ సమితి టీంలు రెడీ
బషీర్‌బాగ్ : నిమజ్జనోత్సవాలకు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నుంచి 160 టీంలను సిద్ధంగా ఉంచినట్లు ప్రధాన కార్యదర్శి డాక్టర్ రావినూతల శశిధర్ చెప్పారు. 34 ప్రధాన చెరువులు, 64 ప్రాంతాల్లో నిమజ్జన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. వివిధ ప్రాంతాల నుంచి సుమారు 40 లక్షల భక్తులు వస్తారని, వారికి అన్న ప్రసాదాలు, వాటర్, మెడికల్ క్యాంపులు అరేంజ్ చేస్తున్నామన్నారు.
శోభాయాత్రలో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, ఉడిపి ఉత్తరాది పీఠాధిపతి సత్యాత్మ తీర్థ స్వామిజీ, రామకృష్ణ మఠం స్వామి బోధమాయన్నదా పాల్గొంటారన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన రద్దయ్యిందని, ఎంజే మార్కెట్ చౌరస్తా వద్ద ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేసి, అమిత్‌షా సందేశాన్ని వినిపిస్తామన్నారు. సమితి ఉపాధ్యక్షుడు బుచ్చిరెడ్డి, గోవింద్ రాఠి, శ్రీరామ్ వ్యాస్, రామరాజు, సంజయ్ పాల్గొన్నారు.
సిటీ బస్సులు ఇక్కడి వరకే..
నిమజ్జనం కోసం గ్రేటర్ ఆర్టీసీ అధికారులు
సిటీలోని వివిధ ప్రాంతాల నుంచి 600 ప్రత్యేక బస్సులు నడపనున్నారు.
మెహదీపట్నం బస్సులు : మాసబ్ ట్యాంక్ వరకు..
కూకట్‌పల్లి బస్సులు : ఖైరతాబాద్వీవీ స్టాచ్యూ వరకు..
సికింద్రాబాద్ బస్సులు : సీటీవో ప్లాజా, ఎస్బీహెచ్, క్లాక్ టవర్, చిలకలగూడ క్రాస్ రోడ్ వరకు..
ఉప్పల్ బస్సులు : రామంతపూర్ టీవీ స్టేషన్
దిల్‌సుఖ్‌నగర్ బస్సులు : గడ్డి అన్నారం, చాదర్‌ఘాట్ వరకు..
రాజేంద్ర నగర్ బస్సులు : దానమ్మ హట్స్ వరకు..
ఇబ్రహీంపట్నం, మిథానీ బస్సులు : ఐఎస్ సదన్
బేబీ పాండ్స్ ఎక్కడెక్కడున్నాయంటే..
బేబీ పాండ్స్: జైపాల్ రెడ్డి స్పూర్తి స్థల్ , హెర్బల్ స్పైసెస్ గార్డెన్ పక్కన, సంజీవయ్య పార్క్ ఎదురుగా, ఎగ్జిబిషన్ గ్రౌండ్, నాంపల్లి, సైదాబాద్ హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఫ్రెండ్స్ కాలనీ, మూసారాంబాగ్ , బతుకమ్మ బావి, గౌలిపుర, వైశాలి నగర్, ఐఎస్ సదన్, శివాలయం రియాసత్ నగర్, లక్ష్మణేశ్వర స్వామి ఆలయం, హమామ్ బౌలి, రజనా బావి, జంగమ్మెట్ లో ఏర్పాటు చేశారు.
పోర్టబుల్ వాటర్ ట్యాంకులు
ఎన్టీఆర్ స్టేడియం-, రామ్‌లీలా గ్రౌండ్, చింతల్‌బస్తీ, మారేడ్‌పల్లి ప్లే గ్రౌండ్ , బల్దియా గ్రౌండ్, చిలకలగూడ, అమీర్‌పేట్ ప్లే గ్రౌండ్ , అలీ కేఫ్, అంబర్‌పేట్-, ఎస్బీఏ గార్డెన్, 100 ఫీట్ రోడ్, కుల్సుంపుర, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, నాంపల్లిలో ఉన్నాయి.
ఎక్స్కవేషన్ పూల్స్
పిల్లర్ నెం. 54 పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే , రామ్‌లీలా గ్రౌండ్, చింతల్‌బస్తీ, జమ్సింగ్ నగర్, గుడి మల్కాపూర్, 100 ఫీట్ రోడ్, ధోబీ ఘాట్, మారుతీ నగర్, షేక్‌పేట్ , ఎన్టీఆర్ స్టేడియం, అలీ కేఫ్, చిలకలగూడ మున్సిపల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేశారు.