మొలకలు తింటే ఇమ్యునిటీ తొందరగా పెరుగుతుంది

మొలకలు తింటే ఇమ్యునిటీ తొందరగా పెరుగుతుంది

కంటి చూపు సమస్యలకూ మంచిదే 

రాత్రి నానబెట్టి తెల్లారాక మూట కట్టి ఉంచాలి. రెండో రోజు తెరిచి చూస్తే మొలకలు వస్తాయి. వీటినిొద్దున్నే పెసలు, శెనగలు వంటి   మొలకెత్తిన గింజలు తినడం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. మొలకెత్తిన గింజల్లో ప్రొటీన్‌‌, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌‌, మాంగనీస్‌‌, ఫోలేట్‌‌, విటమిన్‌‌– సి, విటమిన్‌‌– కె సరిపడినన్ని ఉంటాయి. మన బాడీకి చాలా అవసరం అయిన యాంటీ ఆక్సిడెంట్లు, అమైనో యాసిడ్స్ ఉంటాయి.

పొద్దున్నే తినడం వల్ల ఎక్కువ ఆకలి వేయదు. దీంతో మధ్యాహ్నం భోజనం తక్కువగా తింటాం. బరువు తగ్గాలనుకున్నవాళ్లకి ఈ మొలకల డైట్ బాగా ఉపయోగ పడుతుంది.

 డైజేషన్ సమస్యలున్నవాళ్లకిమొలకలు మెడిసిన్‌‌లా పనిచేస్తాయి. ఇందులో ఇనుము, క్యాల్షియం, జింక్‌‌ వంటివి పుష్కలంగా ఉంటాయి.

 వీటిలో ఉండే ఒమెగా-3 ప్యాటీ యాసిడ్లు రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్‌‌ని తగ్గిస్తాయి. డయాబెటిస్ తో బాధపడుతున్న వాళ్లకి మంచి ఫుడ్.

 మొలకలు రెగ్యులర్ గా తినటం వల్ల మెదడుకు బ్లడ్ సర్క్యులేషన్ సరిగా ఉంటుంది.

 డిప్రెషన్ లో ఉన్న వాళ్లు మొలకలను రెగ్యులర్ ఫుడ్ మెనులో చేర్చుకుంటే మంచిది.

 మొలకల్లో ఇమ్యూనిటీ పవర్ ని పెంచే గుణాలున్నాయి, మొలకల్లోని విటమిన్‌‌– సి తెల్ల రక్తకణాలను యాక్టివ్ గా చేస్తుంది.

విటమిన్‌‌ – ఎ కంటిచూపును బాగుచేస్తుంది.

కంటి సమస్యలకు మొలకలు తింటే దివ్య ఔషధంలా ఉపయోగపడుతుంది.

పచ్చిగా తింటే గ్యాస్ ట్రబుల్ వస్తుందని.. తేన్పులు వస్తున్నాయనుకునే వారు మొలకలను ఉడకబెట్టుకుని కొద్ది కొద్దిగా తినడం బెటర్.

ఒక్క మాటలో చెప్పాలంటే మటన్..చేపలు తిన్నంత బలం వస్తుంది.