హైదరాబాద్: గ్రేటర్ విలీనంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. శుక్రవారం (జనవరి2) మంత్రి శ్రీధర్ బాబు గ్రేటర్ లో శివారు ప్రాంతాల విలీనంపై వివరించారు. ప్రజాస్వామిక పద్దతిలోనే GHMC లో శివారు ప్రాంతాల విలీనం జరిగిందన్నారు.ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతోనే విలీనం చేశామన్నారు. సుస్థిర అభివృద్ది కోసమే సిటీకి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం చేశామన్నారు.
GHMC లో శివారు ప్రాంతాలను విలీనం ఎలాంటి సంప్రదింపులు లేకుండా విలీనం చేశారని ప్రతిపక్షాలు విమర్శించగా .. మంత్రి శ్రీధర్ బాబు సమాధానం ఇచ్చారు. ప్రజాస్వామ్య పద్దతిలోనే GHMC లో విలీనం చేశామన్నారు GHMC ని300 వార్డులుగా విభజించామన్నారు. విభజన సమయంలో 5వేల 935 ప్రజలనుంచి సూచనలు రాగా.. వాటిలో 1127 సూచనలను ఆమోదించామన్నారు. సరిహద్దుల మార్పుపై కూడా సూచనలు స్వీకరించామన్నారు. దాదాపు 27 శాతం ప్రజల సూచనలను పరిగణనలోకి తీసుకొని విభజించామన్నారు. 14ఏళ్లలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జనాభా రెండింతలు పెరిగింది..సిటీ పరిధిలోని తెల్లాపూర్ లో ఏడాదిలోనే జనాభా రెండింతలు పెరింగిందన్నారు.
ఇక గ్రేటర్ లో శివారు ప్రాంతాల విలీనం ప్రతిపక్షాలు విమర్శలను తిప్పికొట్టారు మంత్రి శ్రీధర్ బాబు.విలీనంపై సంప్రదింపులు లేవన్నది అవాస్తవం.. GHMC జనరల్ బాడీ మీటింగ్ లో పెద్ద ఎత్తున చర్చ జరిగిందన్నారు. గత ఏడాది కాలంగా విలీనం ప్రక్రియ జరుగుతోంది.. ప్రజాస్వామ్య విధానంలోనే గ్రేటర్ విలీనం జరిగింది..సుస్థిర అభివృద్దికి కోస మే గ్రేటర్ లో విలీనం చేశామన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా విలీనం జరిగింది.. సాధారణ ప్రజలతో కూడా సంప్రదింపులు చేశామన్నారు. గ్రేటర్ పరిధిలోని ప్రజలకు సమాన సర్వీసులు అందిస్తామన్నారు. విలీనం నిర్ణయం శివారు ప్రాంతాలకు కూడా ఆర్థిక వనరులను అందిస్తుందన్నారు. మున్సిపల్ వ్యవస్థను పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు.
