గ్రేటర్ ​సిటీపై పడిన మాండౌస్​ తుపాన్ ​ప్రభావం

గ్రేటర్ ​సిటీపై పడిన  మాండౌస్​ తుపాన్ ​ప్రభావం

బంగాళాఖాతంలో ఏర్పడిన మాండౌస్​ తుపాన్​ ప్రభావం గ్రేటర్ ​సిటీపై పడింది. ఆదివారం రోజంతా వాతావరణం చల్లగా మారింది. చిరు జల్లులు కురిశాయి. సెలవురోజు కావడం, చలిగాలులు వీస్తుండడంతో జనం ఇండ్లకే పరిమితం అయ్యారు. బయటకు వచ్చినవాళ్లు స్వెట్టర్లు, రెయిన్ కోట్లతో కనిపించారు. శేరిలింగంపల్లిలో అత్యధికంగా 2.3 సెంటీమీటర్లు,  బహదూర్ పురా, అత్తాపూర్, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడింది.

మరో రెండ్రోజులపాటు మోస్తరు వానలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వానలు, పొగమంచు కారణంగా శంషాబాద్​ ఎయిర్​పోర్టుకు రావాల్సిన 7-8 విమానాలను అధికారులు ఆదివారం దారి మళ్లించారు. మస్కట్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు వైపు వెళ్లే విమానాలు ఆలస్యమవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

- వెలుగు, హైదరాబాద్/శంషాబాద్