
సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల శివారులోని ఇందూర్ ఇంజినీరింగ్ కాలేజ్ లో నేడు జరిగే డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పరీక్ష కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు సీపీ శ్వేత తెలిపారు. పరీక్ష సమయంలో సెంటర్ వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 2: 30 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.
పరీక్ష వద్ద నుంచి 500 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. త్రీ టౌన్ సీఐ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు, ఏర్పాట్లను అధికారులు సిబ్బంది దగ్గరుండి పర్యవేక్షించాలని సీపీ సూచించారు.