
తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యా శాఖ 11వేల డిఎస్సీ పోస్టులకు నోటిఫికేషన్ ఫలితాలు ఇటీవల విడుదల చేసింది. వివిధ జిల్లాల వారీగా DSC పోస్టుల వివరాలను విద్యా శాఖ మంగళవారం వెల్లడించింది. మొత్తం 11 వేల 62 పోస్టులకు గానూ.. 10 వేల6 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్టు విద్యా శాఖ తెలిపింది. మిగిలిన1056 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పెండింగ్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. 1056 పోస్టుల్లో సెలక్ట్ అయిన అభ్యర్థులు కోర్టు కేసులు, వివిధ కారణాల వల్ల పెండింగ్ లో ఉన్నారు.