మహారాష్ట్రలో ఘనంగా గుడిపడ్వా సంబరాలు

మహారాష్ట్రలో ఘనంగా గుడిపడ్వా సంబరాలు

మహారాష్ట్రలో గుడిపడ్వా సంబరాలు అంబరాన్నంటాయి. నాగ్ పూర్, పుణె, ముంబై, ఠాణె సహా వివిధ నగరాల్లో చిన్నా, పెద్దా అంతా రంగురంగుల దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. సంప్రదాయ చీరకట్టులో ముస్తాబైన మహిళలు బైక్ ర్యాలీలతో ఆకట్టుకున్నారు. కత్తిసాము, కర్రసాము చేసి సత్తా చాటారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా సంబరాలకు దూరమైన మరాఠీలు.. ఈ సారి రెట్టింపు ఉత్సాహంతో పండగ జరుపుకుంటున్నారు. ముంబై సహా అనేక నగరాల్లోని వీధుల్లో శోభయాత్రలతో కోలాహలంగా మారాయి. ముంబైలోని గిర్ గావ్ ప్రాంతంలో మహిళలు నిర్వహించిన బైక్ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్న ఈ ర్యాలీలో 151 మంది బుల్లెట్ బండి నడిపి అదరగొట్టారు. పలు ప్రాంతాల్లో మహిళలు చేసిన వేడుకలు ఆకట్టుకున్నాయి.

ఇవి కూడా చదవండి

సామాన్యులకో రూల్.. అధికారుల బంధువులకో రూల్

ఆర్యన్ ఖాన్ కేసులో కీలక సాక్షి మృతి

వేగంగా వ్యాపిస్తున్న మరో కొత్త వేరియంట్

రష్యా భూభాగంపై ఉక్రెయిన్ అటాక్