హైదరాబాద్, వెలుగు: సోమాజిగూడలోని శ్రీశ్రీ రవిశంకర్ విద్యామందిర్ స్కూల్వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇండియన్ వారియర్స్ థీమ్‌తో నిర్వహించగా చిన్నారులు భారతీయ వీరులను స్మరిస్తూ చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. విద్యా సంస్థల చైర్మన్ మురళి మనోహర్, డైరెక్టర్ వెంకట్ నారాయణ్, ప్రిన్సిపాల్ శీలారెడ్డి పాల్గొన్నారు.

