మెట్రోతో మెరుగైన రవాణా సౌకర్యం

మెట్రోతో  మెరుగైన రవాణా సౌకర్యం

మెట్రోతో సిటీ వాసులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తున్నామన్నారు అధికారులు. ప్రయాణికుల సంఖ్య మళ్లీ పెరుగుతోందని తెలిపారు. అయితే కరోనా నష్టాల నుంచి కోలుకోవడానికి త్వరలో కొత్త స్కీంలు ప్రవేశ పెడ్తామని చెప్పారు.  సువర్ణ ఆఫర్ కు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. హైదరాబాద్ అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో సువర్ణ ఆఫర్ రెండో నెల లక్కీ డ్రా జరిగింది. ఐదుగురు విజేతలకు స్మార్ట్ టీవీ, వాషింగ్ మిషన్, స్మార్ట్ ఫోన్, మైక్రో ఓవెన్ ను అందించారు. మైట్రో రైలు వల్ల టైమ్ సేవ్ అవుతోందన్నారు ఎన్వీఎస్ రెడ్డి. మహిళలు సురక్షితంగా జర్నీ చేస్తున్నారని చెప్పారు. కరోనాతో నష్టాలతో ఉన్న మెట్రోను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎల్ అండ్ టీ మెట్రోతో కలిసి కొత్త స్కీమ్స్ ప్లాన్ చేస్తోందన్నారు ఎన్వీఎస్ రెడ్డి. అన్ లాక్ తర్వాత మెట్రో రైలులో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోందన్నారు అధికారులు.

 ప్రస్తుతం రోజూ 2 లక్షల 40 వేల మంది ట్రావెల్ చేస్తున్నారని తెలిపారు. ప్రయాణికుల సంఖ్యను ఇంకా పెంచుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాపిడో సంస్థ తో టై అప్ అయ్యామన్నారు ఎన్వీఎస్ రెడ్డి.  మెట్రో ఫస్ట్ మైల్, లాస్ట్ మైల్ కనెక్టివిలో భాగంగా బైక్ ట్యాక్సీ సర్వీస్ లను అందుబాటులోకి వచ్చాయని చెప్పారు.  మెట్రో రైళ్లలో మరింతగా కోవిడ్ సేఫ్టీ మెజర్స్ ను అమలు చేస్తామన్నారు L & T ఎండీ కేవీబీ రెడ్డి. మాస్కు ఉంటేనే ప్రయాణికులను జర్నీకి అనుమతి ఇస్తున్నామని చెప్పారు. రైళ్లను శానిటైజ్ చేస్తున్నామని, ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని ప్రయాణికులకు సూచిస్తున్నామని తెలిపారు.