
ఇస్లామాబాద్ : భారత్ లో ఎలక్షన్స్ ముగిసేవరకు రెండు దేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉంటాయని తెలిపారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. “జమ్ముకశ్మీర్ లోని పుల్వామాలో CRPF కాన్వాయ్ మీద జైషే మహ్మద్ ఉగ్రసంస్థ ఆత్మాహుతికి పాల్పడటంతో.. రెండు దేశాల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఆ ఘటనలో 40 మంది జవాన్లు మరణించారు.
ప్రమాదం ఇంకా పొంచి ఉంది. భారత్‌లో ఎన్నికలు ముగిసే వరకు ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉంటాయి. భారత్ నుంచి ఎదురయ్యే ఆక్రమణలకు గట్టి సమాధానం ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం’ అని తెలిపారు ఇమ్రాన్. డాన్ పత్రిక ప్రచురించింది. పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ లోని జైషే మహ్మద్ ఉగ్ర స్థావరాల మీద భారత్ జరిపిన వైమానిక దాడి, తరవాత రోజు పాకిస్థాన్ జరిపిన ప్రతి దాడితో ఇరు దేశాల మధ్య యుద్ధవాతారణం నెలకొంది. పాకిస్థాన్ మీద అంతర్జాతీయంగా ఒత్తిడి రావడంతో ఆ దేశం కాస్త వెనక్కి తగ్గడంతో పరిస్థితులు కాస్త సద్దుమణిగాయి.