ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్‌‌‌‌2లో..సెమీఫైనల్లో ప్రథమేశ్‌‌‌‌

ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్‌‌‌‌2లో..సెమీఫైనల్లో ప్రథమేశ్‌‌‌‌

యెంచియోన్‌‌‌‌ (సౌత్ కొరియా) : ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్‌‌‌‌2లో  ఇండియా యంగ్ ఆర్చర్  ప్రథమేశ్  వరల్డ్ ఆరో ర్యాంకర్‌‌‌‌‌‌‌‌కు షాకిస్తూ సెమీఫైనల్ చేరుకున్నాడు. గురువారం జరిగిన మెన్స్ కాంపౌండ్ క్వార్టర్ ఫైనల్లో 146–145తో 2021 వరల్డ్ చాంపియన్‌‌‌‌నికో వీనర్‌‌‌‌‌‌‌‌ (ఆస్ట్రియా )ను ఓడించాడు.  అభిషేక్ వర్మ రెండో రౌండ్‌‌‌‌లోనే ఓడగా, ప్రియాన్ష్‌‌‌‌ ప్రిక్వార్టర్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో వెనుదిరిగాడు.

విమెన్స్‌‌‌‌ కాంపౌండ్‌‌‌‌ క్వార్టర్ ఫైనల్లో స్టార్ ఆర్చర్ జ్యోతి  సురేఖ 142-–145తో  సారా లోపేజ్ (కొలంబియా) చేతిలో ఓడిపోయింది. మెన్స్‌‌‌‌ రిక్వర్‌‌‌‌‌‌‌‌ టీమ్ ఈవెంట్‌‌‌‌లో ధీరజ్‌‌‌‌, తరుణ్‌‌‌‌ దీప్, మ్రినాల్‌‌‌‌ చౌహాన్‌‌‌‌తో కూడిన ఇండియా తొలి రౌండ్‌‌‌‌లోనే 3–5తో కెనడా చేతిలో చిత్తయింది. దీపిక కుమారి, అంకితా భకట్, భజన్ కౌర్‌‌‌‌‌‌‌‌తో కూడిన విమెన్స్‌‌‌‌ టీమ్ 4–5తో  వియత్నాం చేతిలో షూటౌట్‌‌‌‌లో ఓడి ఇంటిదారి పట్టింది.