బడ్జెట్‌లో మన ఊరు- మన బడి ఊసే లేదు : టీపీటీ

బడ్జెట్‌లో మన ఊరు- మన బడి ఊసే లేదు : టీపీటీ

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఈసారి కూడా విద్యారంగాన్ని నిరుత్సాహపరిచేలా ఉందని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ( TPT) ఆరోపించింది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి పథకానికి నిధుల కేటాయింపు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. పాఠశాల విద్యాశాఖకు రూ.16,092 కోట్లు (5.54%), ఉన్నత విద్యకు రూ.3,001 కోట్లు (1%) మాత్రమే కేటాయించడం నిరుత్సాహపరిచిందని టీపీటీ సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. రూ. 2,90,396 కోట్ల బడ్జెట్ లో కనీసం 10 శాతం అయినా విద్యకు కేటాయిస్తే బాగుండేనని అన్నారు. 

ఉన్నత విద్యకు కేటాయించిన రూ.3,001 కోట్లలో రూ. 500 కోట్లను విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు కేటాయించడాన్ని టీపీటీ తప్పుబట్టింది. గతేడాది కేటాయింపుల కన్నా ఈసారి  (0.31%) ఎక్కువ నిధులిచ్చినట్లు అనిపించినా పెండింగ్ డీఏ, బిల్లుల క్లియరెన్స్, రెండో దశ మన ఊరు – మన బడి పథకం కోసం ప్రత్యేక కేటాయింపులు చేయకపోవడంతో ఈ బడ్జెట్ పూర్తిగా నిరాశ పర్చిందని టీపీటీ సభ్యులు అంటున్నారు.