దేశంలో మరో ఒమిక్రాన్ కేసు

దేశంలో మరో ఒమిక్రాన్ కేసు

న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఐదుకు చేరింది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఒక ఒమిక్రాన్ కేసు వెలుగు చూసింది. ఆఫ్రికన్ కంట్రీ అయిన టాంజానియా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా సోకింది. టెస్టుల్లో ఒమిక్రాన్ గా నిర్ధారణ అయ్యింది. అతడ్ని లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ (ఎల్ఎన్జేపీ) ఆస్పత్రిలో చేర్చి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. ఢిల్లీలో ఫస్ట్ ఒమిక్రాన్ కేసును కనుగొన్నామని హెల్త్ మినిస్టర్ సత్యేంద్ర జైన్ కన్ఫర్మ్ చేశారు. ‘ఇప్పటివరకు కరోనా పాజిటివ్ గా తేలిన 17 మందికి ఎల్ఎన్జేపీ హాస్పిటల్ లో వైద్యం అందిస్తున్నాం. వీరిలో పన్నెండు మంది శాంపిళ్లకు సంబంధించి జీనోమ్ సీక్వెన్సింగ్ పూర్తయింది. ఇందులో ఒక కేసు ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలింది’ అని సత్యేంద్ర జైన్ అన్నారు. కాగా,  రీసెంట్ గా కర్నాటకలో రెండు, గుజరాత్, మహారాష్ట్రలో ఒక్కో ఒమిక్రాన్ కేసు వెలుగు చూశాయి.