
హైదరాబాద్, వెలుగు: దేశంలో ఆరోగ్య రంగ అభివృద్ధికి కేంద్రం ఎన్నో చర్యలు తీసుకుందని, అందులో భాగంగా రాష్ట్రంలో అనేక సౌలతులు కల్పించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం ఏమేం చేసిందో వివరిస్తూ బుధవారం ప్రకటన విడుదల చేశారు. ‘‘ఆయుష్మాన్ భారత్ పథకం కింద రాష్ట్రంలో రూ.902 కోట్లతో 4,549 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేశాం.రూ.1,028 కోట్లతో బీబీనగర్‌లో ఎయిమ్స్ ఏర్పాటు చేశాం.
అందులో రూ.800 కోట్లతో వివిధ నిర్మాణాలు చేపట్టాం. గతంలో ఉన్న ఆసుపత్రిని 720 బెడ్స్ సూపర్ స్పెషాలిటీ దవాఖానగా అభివృద్ధి చేశాం. 30 బెడ్స్‌తో కూడిన ఆయూష్ హాస్పిటల్‌తో పాటు ఎంబీబీఎస్, నర్సింగ్ స్టూడెంట్లకు హాస్టళ్లు, సిబ్బందికి క్వార్టర్లు నిర్మించాం. స్టూడెంట్లకు క్లాసులతో పాటు ప్రజలకు ఓపీ సేవలు ప్రారంభించాం” అని పేర్కొన్నారు.