మీర్పేట్లో పగిలిన కృష్ణా వాటర్ పైప్

మీర్పేట్లో పగిలిన కృష్ణా వాటర్ పైప్

హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారుల నిర్లక్ష్యంతో హైదరాబాద్ మీర్ పేట్  మున్సిపల్ కార్పొరేషన్ 10వ డివిజన్ లో  కృష్ణా వాటర్  పైప్ లైన్ పగిలి రోడ్డు పై నీరు ప్రవహిస్తుంది. గంటల తరబడి నీరు వృథాగా వెళ్తున్నా జలమండలి అధికారులు చూసిచూడనట్టు వ్యవహరిస్తున్నారు. మరోవైపు వాటర్  పైపు పగిలి నీరుపైకి ఎగిసిపడి షాపులను ముంచెత్తాయి. దీంతో షాప్ లలో ఉన్న వస్తువులన్నీ తడిసి ముద్దాయి. పైప్ పగిలడంతో తాము తీవ్రంగా నష్ట పోయామని యజమానులు మొత్తుకుంటున్నారు.

 కృష్ణా వాటర్ పైప్ లైన్ పగిలి రోడ్డుపై నీరు వరదలా ప్రవహించి షాపులలోని వస్తుందని అధికారులకు ఫోన్  చేసి సమాచారం ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదని యజమానులు చెబుతున్నారు.  అటుగా వెళ్లే వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 10వ డివిజన్ 1000 ML వాటర్ ట్యాంక్ పైప్ లైన్ లీక్ కావడంతో పెద్ద ఎత్తున రోడ్లపై నీరు ప్రవహిస్తుంది.