రోమ్: ఇటలీలో ఓ 23 ఏళ్ల యువతికి పొరపాటున ఒకేసారి ఆరు డోసుల ఫైజర్కొవిడ్ వ్యాక్సిన్ఇచ్చారు. సెంట్రల్ ఇటలీలోని టుస్కానీలో నోవా ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పొరపాటును గమనించిన డాక్టర్లు 24 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచి ఆ తర్వాత ఆమెను డిశ్చార్జి చేశారు. నోవా హాస్పిటల్ ప్రతినిధి దీనిపై మాట్లాడుతూ.. ‘కొవిడ్ వ్యాక్సిన్ కోసం ఓ మహిళ ఆదివారం ఆస్పత్రికి వచ్చింది. హెల్త్‌వర్కర్ యాక్సిడెంటల్‌గా వయల్ నుంచి పూర్తిగా వ్యాక్సిన్ తీసి ఇచ్చేసింది. వయల్‌లో ఆరు డోసులు ఉంటాయి. అయితే పొరపాటును గుర్తించి డాక్టర్లకు చెప్పింది. దీంతో ఆ యువతిని అబ్జర్వేషన్లో ఉంచి, పంపించాం..’ అని వివరణ ఇచ్చారు.
