కాఫీ పొడి‌ గడ్డ కట్టకుండా ఉండాలంటే..

కాఫీ పొడి‌ గడ్డ కట్టకుండా ఉండాలంటే..

కాఫీ పొడి‌ గడ్డ కట్టకుండా ఉండాలంటే... కొన్ని బియ్యపు గింజల్ని టిష్యూలో చుట్టి కాఫీ పొడి డబ్బాలో వేయాలి.

  •     గడ్డ కట్టిన ఇంగువ డబ్బాలో నాలుగు పచ్చి మిర్చి వేస్తే, ఇంగువ పొడిగా మారుతుంది.
  •     కత్తికి నిమ్మరసం పూసి వాడితే బెండకాయల జిగురు కత్తికి అంటదు.
  •     కత్తికి కొద్దిగా నిమ్మరసం పూసి యాపిల్‌ కట్‌ చేస్తే యాపిల్‌ ముక్కలు రంగు మారవు.
  •     పావు కప్పు వంట సోడా, పావు కప్పు వెనిగర్‌‌ని సింక్‌ పైపులో వేసి అరగంట వదిలేస్తే, పైప్‌లో పేరుకున్న చెత్త పోతుంది.
  •     నిమ్మకాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే, అవి ఉంచిన కవర్‌‌లో తొడిమ తీసిన పచ్చి మిర్చి వేయాలి.
  •     బియ్యంలో కొద్దిగా ఆముదం నూనె కలిపి ఉంచితే, పురుగులు పట్టకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటాయి.
  •     పాల గిన్నెను చల్లని నీళ్లలో ఉంచి తీశాక, పాలు పోసి వేడిచేస్తే మీగడ బాగా వస్తుంది.