శ్రీలంకలో సెల్ఫీ పాయింట్లుగా తగలబడిన బస్సులు, ధ్వంసమైన కార్లు

శ్రీలంకలో సెల్ఫీ పాయింట్లుగా తగలబడిన బస్సులు, ధ్వంసమైన కార్లు

కొలంబో : ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో అల్లర్లు పెద్ద ఎత్తున చెలరేగాయి. మొదట్లో శాంతియుతంగా కొనసాగిన నిరసనలు కాస్తా హింసాత్మకంగా మారాయి. ఈ క్రమంలో ఆందోళనకారులు శ్రీలంక మాజీ ప్రధాని మహింద రాజపక్స కుటుంబాలకు చెందిన ఇళ్లను, కార్యాలయాలను ధ్వంసం చేశారు. 
ఆందోళనకారుల చేతుల్లో తగలబడిపోయిన కార్లు, బస్సుల వద్ద ప్రస్తుతం జనాలు సెల్ఫీలు తీసుకుంటున్నారు. చెరువుల్లో మునిగిపోయిన బస్సులు, కార్ల వద్ద సెల్ఫీలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన ప్రజలే ఇప్పుడు అక్కడ సెల్ఫీలు తీసుకుంటున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. 

మరిన్ని వార్తల కోసం.. 

కేంద్రం ప్రతిపక్షాలను వేధిస్తోంది

అమిత్ షా హైదరాబాద్ టూర్ షెడ్యూల్ ఖరారు