కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం .. శ్రీనగర్‌‌‌‌‌‌‌‌కు ‘మిగ్29’ ఫైటర్స్​

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ..  శ్రీనగర్‌‌‌‌‌‌‌‌కు ‘మిగ్29’ ఫైటర్స్​
  • శ్రీనగర్‌‌‌‌‌‌‌‌కు ‘మిగ్29’ ఫైటర్స్​
  • చైనా, పాకిస్తాన్​లతో ముప్పు నేపథ్యంలో మోహరింపు
  • ‘మిగ్ 21’ స్క్వాడ్రన్‌‌ స్థానంలో ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: చైనా, పాకిస్తాన్ నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అప్‌‌గ్రేడ్‌‌ చేసిన ‘మిగ్29’ ఫైటర్‌‌‌‌ జెట్లను శ్రీనగర్ ఎయిర్‌‌‌‌బేస్‌‌లో మోహరించింది. ఇప్పటిదాకా ఉన్న ‘మిగ్ 21’ స్క్వాడ్రన్‌‌ స్థానంలో ‘డిఫెండర్ ఆఫ్ ది నార్త్‌‌’గా పిలిచే ట్రైడెంట్స్ స్క్వాడ్రన్‌‌ను ఏర్పాటు చేసింది. ‘‘కాశ్మీర్ వ్యాలీ మధ్యలో శ్రీనగర్ ఉంటుంది. మైదానాల కంటే ఎత్తులో ఉంటుంది. సరిహద్దులకు దగ్గర్లో ఉన్నందున వేగంగా స్పందించేందుకు వ్యూహాత్మకంగా ఇక్కడ ఎయిర్‌‌‌‌క్రాఫ్ట్‌‌ను మోహరించడం ఉత్తమం. వాటికి ఎలక్ట్రానిక్ సిస్టమ్స్‌‌, లాంగ్ రేంజ్ మిసైళ్లను అమర్చి ఉంటాయి. మిగ్ 29 ఫైటర్ జెట్లతో రెండు వైపుల నుంచి శత్రువులను ఎదుర్కోగలం” అని ఐఏఎఫ్​ పైలట్ స్క్వాడ్రన్ లీడర్ విపుల్ శర్మ చెప్పారు. 

‘‘ఈ ఎయిర్‌‌‌‌క్రాఫ్టులను రాత్రిళ్లు కూడా ఆపరేట్ చేసేందుకు వీలుగా నైట్ విజన్ గాగుల్స్‌‌ను ఏర్పాటు చేశారు. గాల్లోనే ఇంధనం నింపే సామర్థ్యం ఉండటంతో సుదూరాలకూ వీటిని పంపించవచ్చు’’ అని పైలట్ స్క్వాడ్రన్ లీడర్ శివమ్ రాణా చెప్పారు. ‘‘ ఎయిర్ -టు -గ్రౌండ్ ఆయుధాలను కూడా ఫైటర్ జెట్లలో చేర్చాం. ఈ విమానాలను నడిపేందుకు పైలట్లను ఇండియన్ ఎయిర్‌‌‌‌ఫోర్స్‌‌ ఎంపిక చేస్తుంది” అని వివరించారు. శ్రీనగర్‌‌ ఎయిర్‌‌‌‌బేస్‌‌కు జనవరిలోనే ‘మిగ్ 29’ జెట్లను తరలించారు. మిగ్ 21తో పోలిస్తే.. మిగ్ 29తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీటికి లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైళ్లను, ఎయిర్ టు గ్రౌండ్ ఆయుధ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 2020 నాటి గల్వాన్ ఘర్షణ తర్వాత చైనా వైపు నుంచి వచ్చే ముప్పును అధిగమించడానికి లడఖ్ సెక్టార్‌‌లో మోహరించిన మొదటి విమానం ‘మిగ్ -29’.