ఐరిస్​తోనూ ఆస్తుల రిజిస్ట్రేషన్

ఐరిస్​తోనూ ఆస్తుల రిజిస్ట్రేషన్
  • ఈసారి రూ. 15 వేల కోట్ల ఇన్​కం టార్గెట్​ 
  • స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శ్రీనివాస్ 

భీమదేవరపల్లి, వెలుగు: ఈ ఏడాది 15వేల కోట్ల ఆదాయం టార్గెట్ గా పెట్టుకున్నట్టు తెలంగాణ స్టేట్ స్టాంప్స్, రిజిస్ట్రేషన్​ టెక్నాలజీ , సర్వీసుల ఐజీ వేముల శ్రీనివాస్ తెలిపారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులోని ప్రజా లైబ్రరీని శుక్రవారం ఆయన విజిట్​చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ చేయడానికి గతంలో ఆధార్, వేలిముద్రతో అథెంటికేషన్ ​చేసేవాళ్లమని, ఇప్పుడు ఐరిస్​ పద్ధతిని కూడా చేర్చామన్నారు.  స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా గత ఏడాది 12వేల 500 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. పెరిగిన రేట్లతో మార్కెట్ వాల్యూ ప్రకారం ప్లాట్లకు 30 శాతం, వ్యవసాయ భూమికి 50 శాతం బేసిక్ విలువతో చార్జీలు వర్తిస్తాయన్నారు. గజానికి రూ. 20వేల వరకు ఉంటే 15 శాతం, రూ.40వేల పైన ఉంటే10 శాతం చార్జీలు వసూలు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని 141 రిజిస్ట్రేషన్ ఆఫీసుల మోడ్రనైజ్​ చేస్తున్నట్టు చెప్పారు. వెంట ముళ్ల శ్రీనివాస్, తాళ్ల వీరేశం, రవీందర్, గొల్లపల్లి లక్ష్మయ్య, వెంకటేశ్వర్లు ఉన్నారు.