ఫీఫా మ్యాచ్లో సంజూపై అభిమానం చాటుకున్న ఫ్యాన్స్

ఫీఫా మ్యాచ్లో సంజూపై అభిమానం చాటుకున్న ఫ్యాన్స్

అవకాశాలిచ్చినా సద్వినియోగం చేసుకోనప్పుడు, ఫిట్నెస్ కోల్పోయినప్పుడు ఆటగాడు తుది జట్టుకు దూరమవడం సాధారణం. కానీ టీమిండియా ప్లేయర్ సంజూ శాంసన్ విషయంలో మాత్రం భిన్నంగా జరుగుతోంది. అవకాశాలు వచ్చిన ప్రతిసారి సత్తా చాటుతున్నా.. సెలక్టర్స్ నుంచి మాత్రం మొండి చెయ్యే ఎదురవుతోంది. దీనిపై ఇటు క్రికెట్ అభిమానులతో పాటు అటు విశ్లేషకులు సైతం  బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఖతార్‌లో జరిగిన ఫీఫా వరల్డ్ కప్ మ్యాచ్ లో సంజూ శాంసన్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. సంజూ వీ ఆర్ విత్ యూ అని రాసి ఉన్న బ్యానర్లతో హల్ చల్ చేశారు. తమ అభిమాన ఆటగాడికి సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ బీసీసీఐకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలను రాజస్థాన్ రాయల్స్ తన ట్విట్టర్ ఖాతాల్లో పోస్ట్ చేసింది. అవి కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.