3 లక్షల వ్యవసాయ ఖాతాల్లో తప్పుడు ఆధార్

3 లక్షల వ్యవసాయ ఖాతాల్లో తప్పుడు ఆధార్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఊర్లలో కొందరి వ్యవసాయ భూముల అకౌంట్లను తప్పుడు ఆధార్ నంబర్లతో సీడింగ్ చేశారని, వాటిని వెంటనే సరి చేయాలని కలెక్టర్ ను సీసీఎల్ఏ డైరెక్టర్ ఆదేశించారు. భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా కొత్త పాసుబుక్కులు ఇచ్చే టైంలో వ్యవసాయ భూముల అకౌంట్లన్నింటినీ భూమి ఓనర్ల ఆధార్ నంబరతో సీడింగ్ చేశారు. అయితే కొందరి అకౌంట్లలో 1111 11111111, 123412341234, 33 3333333333, 444444444444,666 6666666666, వంటి తప్పుడు ఆధార్ నంబర్లువేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 2,99,974 ఖాతాలకు పట్టాదారు పాస్ బుక్కుల జారీ నిలిచిపోయింది. ఈఖాతాలకు సంబంధించిన యజమానుల ఆధార్ నంబర్లు సేకరించాలని పలుమార్లు రెవెన్యూ సిబ్బందిని ఆదేశించినా ఇప్పటివరకు ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. ఈ ఖాతాల్లో రెండు లక్షలకు పైగా ఖాతాలు ఎన్నారైలకు చెందినవేనని, ఇదే సమస్యగా మారిందని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి.